‘రఫేల్‌ సరఫరాలో జాప్యం జరగదు’

25 May, 2020 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత్‌కు 36 రఫేల్‌ జెట్‌ విమానాల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగబోదని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లినైన్‌ చెప్పారు. ఈ విషయంలో విధించిన గడువును తాము గౌరవిస్తామని అన్నారు. ఫ్రాన్స్‌ నుంచి రూ.58,000 కోట్లతో 36 రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ విమానాల కొనుగోలుకు 2016 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 36 రఫేల్‌ విమానాల్లో 30 విమానాలు ఫైటర్‌ జెట్లు, మరో ఆరు ట్రైనర్‌ జెట్లు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌మంత్రి గత ఏడాది అక్టోబర్‌ 8వ తేదీన మొదటి రఫేల్‌ విమానాన్ని ఫ్రాన్స్‌ నుంచి స్వీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో విమానాన్ని ఫ్రాన్స్‌ అందజేసిందని ఇమ్మానుయేల్‌ చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రఫేల్‌ విమానాల సరఫరాలో జాప్యం తప్పదని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు