ఫేస్‌ మాస్క్‌ ఉంటేనే పెట్రోల్‌, డీజిల్‌

1 May, 2020 14:11 IST|Sakshi

  గోవా ప్రభుత్వం నిర్ణయం

పనాజి : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు గోవా ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న గోవా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ముఖాలకు మాస్క్‌ లేకపోతే వాహనాలకు పెట్రోల్‌ పోసేదిలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ బంకుల యాజామాన్యలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే రేషన్‌ షాపుల వద్దకు కూడా మాస్క్‌లతో రావాలని, లేకపోతే రేషన్‌ నిలిపివేస్తామని హెచ్చరించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. (రెడ్ ‌జోన్‌లో దేశ రాజధాని జిల్లాలు)

కాగా గోవాలో ఇప్పటి వరకు కేవలం 7 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. వారంతా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్త చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన్నప్పుడు ప్రజలంతా మాస్క్‌లు ధరించేలా ప్రజల్లో చైతన్యం కలిగిస్తంది. (కిలో మటన్‌ రూ. 700కే అమ్మాలి)

మరిన్ని వార్తలు