గ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచం: పెట్రోలియం శాఖ

4 Jul, 2014 19:27 IST|Sakshi
న్యూఢిల్లీ: సబ్సిడీ గ్యాస్ సిలెండర్లు, కిరోసిన్, డిజీల్ ధరలను పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలేమి లేవని ప్రధాన్ తెలిపారు. కిరోసిన్, డీజిల్, ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ల ధరల పెంచేందుకు ప్రభుత్వ ప్రతిపాదన ఉందని వస్తున్న వార్తలను ఖండించారు. 
 
ఎల్ పీజీ గ్యాస్ సిలెండర్ ధర 250 రూపాయలు, కిరోసిన్  5 రూపాయలు పెంచాలని కిరిటీ పరేఖ్ ప్యానల్ సిఫారసు చేసినప్పటికి ఇప్పట్లో ధరల పెంపు ఉండదన్నారు. బుధవారం నాన్ సబ్సిడీ ఎల్ పీజీ ధరను 16.50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. 
 
మరిన్ని వార్తలు