మావోల దాడిపై స్పందించిన కేంద్ర మంత్రి

14 Mar, 2018 13:15 IST|Sakshi
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సుకుమా : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం  బుధవారం ఉదయం శ్రద్ధాంజలి ఘటించారు. కాగా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంతోపాటు, నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాదాన్ని సవాలుగా తీసుకున్నాయని హన్స్‌రాజ్‌ తెలిపారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో నక్సల్స్‌ ఏరివేత చేపడతున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమర జవాన్లకు సంతాపం తెలిపారన్నారు.
 
బలగాలను ఆధునీకరిస్తాం

నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో జవాన్లకు రక్షణగా సాంకేతికతను వాడుకుంటామని హన్స్‌రాజ్‌ వెల్లడించారు. మందుపాతరలను గుర్తించేందుకు ఐఈడీ డిటెక్షన్‌ టెక్నిక్‌ను వినియోగిస్తామన్నారు. ఆయాప్రాంతాల్లో బలగాలను పెంచడానికి బదులు ఆధునిక ఆయుధాలను జవాన్లకు అందచేస్తామన్నారు. కాగా సుకుమా జిల్లాలో మంగళవారం సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 9 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు