స్కూల్ టీచర్లకు ఇక నో జీన్స్!

11 Jun, 2016 08:34 IST|Sakshi
స్కూల్ టీచర్లకు ఇక నో జీన్స్!

చండీగఢ్: ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక జీన్స్ వేసుకోకూడదంటూ నిబంధనలు తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. ఉపాధ్యాయులు సమాజంలో ఆదర్శంగా ఉండాలని, అయితే కొందరి డ్రెస్సింగ్ విధానం అభ్యంతరకరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొచ్చామని వెల్లడించింది. ఈ మేరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆర్ఎస్ కర్బ్ ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఉపాధ్యాయులు జీన్స్ లాంటి వస్త్రాలు ధరించడం మూలంగా ప్రజల్లో వారిపట్ల సరైన భావన ఉండటం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఒడీషా లాంటి రాష్ట్రాల్లో పాఠశాల టీచర్లకు యూనిఫామ్స్ ఉన్నటువంటి విషయాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రెటరీ పీకే పీకే దాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే హర్యానాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికి పైగా ఉన్నటువంటి 40 ఏళ్ల లోపు టీచర్లు ఈ నిబంధనతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో గతంలోనే భగవత్ గీతను  పాఠ్యపుస్తకాల్లో చేర్చిన విషయం తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు