చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు

24 Jan, 2020 04:44 IST|Sakshi

ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలుకు సిద్ధమవుతున్న తీహార్‌ జైలు

న్యూఢిల్లీ: ఆడపిల్లల రక్షణ విషయంలో యావత్‌ దేశాన్ని అభద్రతలోకి నెట్టివేసిన ఢిల్లీ నిర్భయ ఘటనలో దోషులు నలుగురినీ ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీసేందుకు తీహార్‌ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉరితీయడానికి ముందు ఏ ఖైదీనైనా వారి ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనవాయితీ. తీహార్‌  జైలు అధికారులు సైతం ఈ నలుగురినీ ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నించగా నలుగురిలో ఏ ఒక్కరు కూడా సమాధానమివ్వకుండా మౌనాన్ని ఆశ్రయించారనీ, వారి సమాధానం కోసం వ్డేచి చూస్తున్నామని అడిషనల్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ రాజ్‌కుమార్‌ వెల్లడించారు. నలుగురినీ రాతపూర్వకంగా తమ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు. (నిర్భయ కేసు : పిటిషనర్కు సుప్రీం చురకలు)

ఒకసారి వారు నోరువిప్పి తమ చివరి కోరిక ఏమిటో చెపితే దాన్ని తీర్చగలుగుతామా లేదా అన్న విషయాన్ని జైలు అధికారులు పరిశీలిస్తారని వ్యాఖ్యానించారు. ‘అయితే అన్ని కోర్కెలూ తీర్చే అవకాశం ఉండదు. ఖైదీలు తమ కోర్కెను రాతపూర్వకంగా ఇచ్చిన తరువాత దానిపై అధికారులు నిర్ణయం తీసుకొంటారు’అని తెలిపారు. కనీసం మీరు చివరిసారిగా ఎవరినైనా కలుసుకోవాలనుకుంటున్నారా? అనీ, మీ ఆస్తులను, మీకు సంబంధించిన వాటిని ఎవరికైనా అప్పజెప్పాలనుకుంటున్నారా అని కూడా వారిని ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు.  ఢిల్లీ హైకోర్టు నిర్భయ దోషులైన వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6గంటలకు ఉరి తీయాలని ఆదేశాలు జారీచేసింది.  (దోషులను క్షమించడమా... ప్రసక్తే లేదు!)

చదవండి:

కంగన మాటల్లో తప్పులేదు: నిర్భయ తల్లి

ఆమెను నిర్భయ దోషులతో కలిపి ఉంచాలి

నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత

ఒక్కొక్కరిని ఉరి తీయండి.. అప్పుడే: నిర్భయ తల్లి

న్యాయమూర్తి అరోరా సుప్రీంకు బదిలీ
నిర్భయ ఘటనలో దోషులకు మరణ శిక్ష విధించిన సెషన్స్‌ జడ్జి సతీష్‌ కుమార్‌ అరోరాను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన అదనపు రిజిస్ట్రార్‌గా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. అరోరా నిర్భయ కేసుతోసహా ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు దాఖలు చేసిన పలు కేసులను విచారించారు. (ఫిబ్రవరి 1 ఉరిశిక్ష అమలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు