కేరళలో 11 మంది మతమార్పిడి

25 Dec, 2014 04:26 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో తాజాగా మరో 11 మంది హిందూ మతంలోకి మారారు. అలప్పుజా జిల్లా కాయంకుళం దగ్గర్లోని కేశవూర్ ఆలయంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మంది బుధవారం వీహెచ్‌పీ చొరవతో హిందూమతం స్వీకరించారు. ఇదే జిల్లాలో ఈ నెల 21న 30 మంది ఎస్సీ క్రైస్తవులు హిందూ మతం పుచ్చుకోవడం తెలిసిందే. కాగా, కేరళలో బలవంతపు మతమార్పిళ్లు జరగడంలేదని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు. మరోవైపు జనవరి 4న రాజస్థాన్‌లోని ఝుంఝునులో క్రైస్తవ కుటుంబాలను హిందూ మతంలోకి మారుస్తామని వీహెచ్‌పీ ప్రకటించింది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా