భారత్‌ని హెచ్చరించడం ఎవ్వరి వల్ల కాదు

17 Oct, 2014 07:00 IST|Sakshi
భారత్‌ని హెచ్చరించడం ఎవ్వరి వల్ల కాదు

వూనేసార్(హర్యానా): అరుణాచల్ ప్రదేశ్‌లో, భారత్ చైనా సరిహద్దు వెంబడి, రహదారిని నిర్మించాలన్న కేంద్రం ప్రణాళికకు చైనా ఆక్షేపించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘భారత్‌కు ఏ దేశం కూడా హెచ్చరిక జారీచేయజాలదు. ప్రపంచంలోనే బలమైన దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఇక, ఇండో చైనా సరిహద్దు సమస్యపై, చైనా భారత్‌తో చర్చించి పరిష్కరించుకోవచ్చని నా భావన.’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. గురువారం జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) ఆవిర్భావ దినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పా ల్గొన్న అనంతరం రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో భారత్ రహదారి ప్రణాళికపై చైనా అభ్యంతరం వ్యక్తంచేసిన మరుసటిరోజునే రాజ్‌నాథ్ ఇలా తీవ్రంగా ప్రతిస్పందించారు.
 దాడులకు ఐఎస్ అల్ కాయిదా పన్నాగం

 ప్రపంచంలోనే భయా నక ఉగ్రవాద సంస్థ

లుగా పేరుమోసిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్), అల్ కారుుదా కలసి దేశంలోని పలు నగరాల్లో, పలురకాల దాడులకు దిగనున్నాయుని ఉగ్రవాద వ్యతిరేక జాతీయు భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) గురువారం హెచ్చరించింది. ఎన్‌ఎస్‌జి డెరైక్టర్ జనరల్ జేఎన్ చౌధురి ఈ మేరకు హెచ్చరికలు చేస్తూ, 2008లో వుుంబైపై జరిగిన ఉగ్రవాద దాడి ఈ దాడులకు నాందిగా భావిస్తున్నట్టు చెప్పారు. దాడులకోసం ప్రపంచ ఉగ్రవాద సంస్థలు అలాంటి ఇతర ఉగ్రవాద సంస్థలతో కలసి పథకం వేసే ఆస్కారం ఉందని చౌధురి చెప్పారు. భారత్‌లో ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన హర్కత్ ఉల్ వుుజాహిదీన్, జైషే మొహ్మద్, ఇండియున్ వుుజాహిదీన్, లష్కరే తోరుుబా వంటి ఉగ్రవాద సంస్థలతో ఐఎస్, అల్‌కాయిదా కలిసే ప్రవూదం ఉందని ఆయన చెప్పారు. అరుుతే,..ఉగ్రవాద దాడులకు తగిన విధంగా, ఎక్కడిక్కడ ప్రతిస్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్‌ఎస్‌జీ స్పష్టంచేసింది. జమ్ము కాశ్మీర్‌లో ఐఎస్ మిలిటెంట్ గ్రూప్ పతాకాల ఆవిష్కరణ ఆందోళనకరమైన పరిణామమని ఓ సైన్యాధికారి ప్రకటించిన మర్నాడే ఎన్‌ఎస్‌జీ ఈ హెచ్చరికలు జారీ చేయుడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు