ఇక వారికి పెరోల్ ఇవ్వరట

31 Aug, 2016 13:29 IST|Sakshi

ముంబయి: హత్యలు చేసినవారికి, అత్యాచారాలకు పాల్పడినవారికి పెరోల్ ఇవ్వకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు బాలకాలికల అక్రమ రవాణాలకు పాల్పడే వారికి కూడా ఈ పెరోల్ సౌకర్యం ఉండదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర హోమంత్రిత్వశాఖ గతవారం పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు తమను పెరోల్పై విడుదల చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు.

వాటిపై నిర్ణయం తీసుకోకుండా నిలిపి ఉంచింది. లైంగిక దాడి కేసుల్లో, హత్య కేసుల్లో నిందితులకు పెరోల్ ఇవ్వకూడదనే నిర్ణయంపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే ప్రస్తుతం వచ్చిన పెరోల్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోనుంది. కుప్పలుకుప్పలుగా పెరోల్ అప్లికేషన్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

>
మరిన్ని వార్తలు