సబ్సిడీ సిలిండర్లు పెంచే ప్రతిపాదనలేదు

5 Jan, 2014 02:02 IST|Sakshi

కొచ్చి: సబ్సిడీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు.  కేరళలోని పుతేవ్యపె వద్ద నెలకొల్పిన పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడికి వచ్చిన మొయిలీ ఈ విషయం చెప్పారు.

 

దేశంలో 90 శాతం మంది సబ్సిడీ సిలిండర్లను వినియోగించుకుంటున్నారని, కేవలం పది శాతం మందికి మాత్రమే ఆ పథకం వర్తించడం లేదన్నారు. కాగా, గురువారం ఆర్థిక మంత్రి చిదంబరం ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం సబ్సిడీపై ఏడాదికి ఇస్తున్న 9 సిలిండర్లను 12 పెంచాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు