రెడ్‌ జోన్‌లో మినహాయింపులకు నో..

3 May, 2020 10:43 IST|Sakshi

లక్నో : రెడ్‌ జోన్‌లో ఎలాంటి మినహాయింపులు ఇచ్చిదిలేదని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 19 జిల్లాలను రెడ్‌ జోన్‌గా గుర్తించామని, వాటిల్లో కఠిన చర్యలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రెడ్‌ జోన్‌లో ఉన్న ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌లోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఆరెంజ్‌ జోన్లను గ్రీన్‌జోన్లుగా మలిచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడిన యోగి ఆదిత్యానాథ్‌ త్వరలోనే యూపీలో కరోనా ఫ్రీ రాష్ట్రంగా తయారుచేస్తామని చెప్పారు. (రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ!)

ఇక గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో పలు రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నామని సీఎం ప్రకటించారు. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలన్నీ తెరుచుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విడతల వారీగా వారిని పంపుతున్నామన్నారు. కాగా యూపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్‌ కారణంగా 43 మంది మృత్యువాత పడ్డారు. (ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా)

>
మరిన్ని వార్తలు