'మత హింస అంతగా పెరగలేదు'

9 Dec, 2015 16:16 IST|Sakshi
'మత హింస అంతగా పెరగలేదు'

న్యూ ఢిల్లీ: దేశంలో మతహింస తీవ్రంగా పెరిగిపోతుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాజ్యసభలో ఓ ప్రకటనను విడుదల చేశారు. అల్పసంఖ్యాక మతాలవారిపై హింసాత్మక ఘటనలు పెరిగాయన్న వాదన సరైంది కాదన్నారు. 2014లో దేశ వ్యాప్తంగా 644 మత ఘర్షణ సంఘటనలు చోటుచేసుకోగా.. వీటిల్లో 95 మంది మృతి చెంది, 1,921 మంది గాయపడినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ వరకు ఈ తరహా  ఘటనలు 650  చోటుచేసుకోగా ఇందులో 84 మంది మృతి చెంది, 1979 మంది గాయపడినట్లు రిజిజు వెల్లడించారు. ప్రతిపక్షాల ఆరోపణల స్థాయిలో మతహింస పెరగలేదని తెలుపుతూ రిజిజు ఈ గణాంకాలను వెల్లడించారు.


దాద్రీ ఘటనపై విపక్షాలు అడిగిన ఓ ప్రశ్నకు వివరణ ఇస్తూ.. నిషిద్ధ జంతువును హత్య చేశారన్న ఆరోపణలతో ఓ కుటుంబంపై దాడికి పాల్పడి ఓ వ్యక్తి మృతికి కారణమైన 10 మందిపై కేసులు నమోదుచేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు