'ఎల్టీటీఈ నుంచి ఎటువంటి ముప్పు లేదు'

6 Jul, 2015 20:03 IST|Sakshi

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని ముల్లా పెరియార్ డ్యామ్ కు ఎల్టీటీఈ నుంచి ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్సీ హెచ్చరికలను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ డ్యామ్ కు ఎల్టీటీఈ కూల్చివేస్తుందన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ముల్లా పెరియార్ డ్యామ్ కు ఎల్టీటీఈ ముప్పు ఉన్న కారణం చేతనే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆఫడవిట్ ను దాఖలు చేసిందన్నప్రతిపక్షాల ఆరోపణల్ని ఆర్థికశాఖ మంత్రి పన్నీరు సెల్వం ఖండించారు.  ఆ ఆరోపణలు నిజం కాదన్నారు.

 

కాగా, ముల్లా పెరియార్ డ్యామ్ కేసు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో అడిషనల్ అఫడివిట్  దాఖలు చేయనున్నట్లు మాత్రం పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు కట్టడాలకు లష్కర్ ఏ తోయిబా, మావోయిస్టుల నుంచి మాత్రమే ముప్పు ఉందని కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు