అనుమానాలు రేకెత్తిస్తోన్న రైల్వేశాఖ తాజా సర్క్యులర్‌‌

24 Jun, 2020 10:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు రవాణా రంగం దారుణంగా దెబ్బతిన్నది. దాదాపు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరగడం లేదు. కఠిన నియమ నిబంధనల మధ్య దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికి కూడా కేంద్రం రైల్వే సర్వీసులకు అనుమతివ్వడం లేదు. ఈ క్రమంలో ఆగస్టు మధ్య వరకు కూడా రైల్వే సేవలను పునరుద్ధరించబోవడం లేదనేది తాజా సమాచారం. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ.. అన్ని రకాల అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌లకు సంబంధించి పూర్తి సొమ్మును ప్రయాణికులకు రీఫండ్‌ చేయాల్సిందిగా అన్ని జోన్లకు సూచించినట్లు సమాచారం. (రైల్వే ఇక మేడిన్‌ ఇండియా)

ఏప్రిల్ 14న లేదా అంతకు ముందు వరకు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేయాలని.. ప్రయాణికులకు పూర్తి సొమ్మును వాపసు‌ చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని జోన్లకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రైల్వే శాఖ రోజు 230 మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. అయితే కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎక్కువ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆగస్టు మధ్య వరకు రైలు ప్రయాణాలను వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే జూన్ 30 వరకు అన్ని సాధారణ రైళ్ల నిర్వహణను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. (‘జపాన్‌ అని చెప్పి.. చైనాకు లాక్కెళ్తారా’)

మరిన్ని వార్తలు