వైద్యుల కోసం సరిహద్దు మార్గం ప్రారంభం

25 Apr, 2020 12:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి నోయిడా సరిహద్దు మార్గంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది రాకపోకలను పునరుద్ధరించినట్లు గౌతమ్‌ బుద్ధనగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్‌వై శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ నుంచి నోయిడా సరిహద్దు మార్గంలో వైద్య సిబ్బంది రాకపోకలను సీల్‌ చేసిన విషయం తెలిసిందే. (సీఎస్‌, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమావేశం)

సరిహద్దు మూసివేత ఉత్తర్వులు 21/4/2020 మినహాయింపు నిబంధన నంబర్‌ 1 ప్రకారం ఢిల్లీ నుంచి నోయిడా  సరిహద్దు మధ్య వైద్య సిబ్బందిని తరలించడానికి అనుమతి ఉందని ఆయన స్ప‍ష్టం చేశారు. కరోనా యోధులైన వైద్యుల నిరంతర కృషికి వందనాలు అని అన్నారు. వైద్య సిబ్బంది సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. (లాక్‌డౌన్ నిబంధనలు వారి ఆశలను చిదిమేసింది)

ఇక దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు వైద్యులు,పారామెడికల్‌ సిబ్బందికి సరిహద్దు దాటి వెళ్లడానికి అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ప్రభుత్వం జారీ  చేసిన  పాస్‌ కలిగి ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రవేశం ఉంటుంది. అలాగే ఎయిమ్స్, సఫ్దర్‌గంజ్, ఆర్‌ఎంఎల్, మిలిటరీ ఆసుపత్రి వంటి వైద్య సంస్థలలో పనిచేసే వారికి కూడా ఈ నిబంధన ప్రకారం అనుమతులు వర్తిస్తాయి.   (కేంద్ర‍ం ప్రకటనపై ఢిల్లీ సర్కార్‌ అసంతృప్తి)

మరిన్ని వార్తలు