జీతం అడిగిన యువతిపై అమానుషం. షాకింగ్‌ వీడియో

13 May, 2019 13:53 IST|Sakshi

 నెల జీతం అడిగిన   పాపానికి యువతిపై దారుణం

జుట్టుపట్టి లాగి, కర్రలతో కొట్టి, నడివీధిలో వీరంగం 

ఈ షాకింగ్‌ వీడియో వైరల్‌

న్యూఢిల్లీ : తనకు రావాల్సిన జీతం అడిగిందనే  అక్కసుతో ఒక యువతిని దారుణంగా హింసించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిస్సహాయురాలైన యువతిపై కొంతమంది యువకులు సామూహింగా దాడికి దిగి అమానుషంగా ప్రవర్తించారు. జుట్టు పట్టి లాగి, కర్రలతో దారుణంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్‌, గ్రేటర్‌ నోయిడా పరిధిలోని కమర్షియల్‌ ఏరియాలో నడిరోడ్డుపై ఈ ఉదంతం చోటు చేసుకుంది.  ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

స్థానికంగా ఉండే సెలూన్‌లో బాధిత మహిళ ఉద్యోగిగా  చేరింది. అక్కడ తన మొదటి జీతం కోసం ఎంతో ఆశగా ఎదురు చూసింది. అయితే షాపు యజమానికి వేతనాన్ని చెల్లించడం ఆలస్యం చేయడంతో..తనకు జీతం ఇవ్వాల్సిందిగా వారిని కోరింది.  అదే ఆమె చేసిన  చేసిన నేరం. ఆగ్రహంతో రెచ్చిపోయిన దుర్మార్గులు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు.  జుట్టుపట్టి లాగి,  కర్రలతో కొట్టుకుంటూ నడి వీధిలో ఆమెపై నీచాతి నీచంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై   బాధిత యువతి నాలెడ్జ్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  యువతిపై జరిగిన దాడి కేసులో నాలెడ్జ్ పార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని  అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
నెల జీతం అడిగిన పాపానికి యువతిపై దాడి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా : తండ్రి అంత్యక్రియలకు కూడా..

టీవీ చానళ్లకు పెరిగిన వీక్షకులు

రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా

నేడు ప్రధాని మోదీ వీడియో సందేశం

పీఎం–జీకేవై పంపిణీ సజావుగా జరపాలి

సినిమా

ఆంటీలా మారిన మలైకా.. ఏం చేస్తుందంటే!

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా