మసీదుతో శబ్ద కాలుష్యం!

3 Jul, 2017 00:55 IST|Sakshi
మసీదుతో శబ్ద కాలుష్యం!

న్యూఢిల్లీ: ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌(ఐసీఎస్‌ఈ) ఆరో తరగతి పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఇచ్చిన పాఠంలో ‘మసీదు’ ఫొటోను ప్రచురించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీఎస్‌ఈ ఆరో తరగతి సైన్స్‌ పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఓ పాఠం ఉంది. అందులో కాలుష్యానికి కారకాలుగా రైలు, కారు, విమానంతో పాటు మసీదు పేరు పేర్కొంది.

దీనికి మసీదు ముందు ప్రార్థన చేస్తున్న వ్యక్తుల ఫొటోను ముద్రించింది. దీనిపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచురణకర్త హేమంత్‌ గుప్తా స్పందిస్తూ.. తప్పు భావనతో తాము మసీదు ఫొటోను ప్రచురించలేదని.. ఇది ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని పేర్కొన్నారు. అలాగే వెంటనే పుస్తకంలోని 202 పేజీలోంచి ఫొటోను తొలగిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు