శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదు!

28 Dec, 2017 03:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన భూముల్ని శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని శ్మశానంగా వాడుకోవడంపై సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ ఖబరస్తాన్‌ ఇంత్‌జామియా అసోసియేషన్‌ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో పాటు ఈ స్థలంపై మరెవరికీ చట్టపరమైన హక్కు లేనందున శ్మశానంగా వాడుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా వాడుకునే హక్కు ఎవరికీ లేదనీ, కోర్టు ఆదేశాలను అన్ని పక్షాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు