బెంగాల్, సిక్కింకు రెడ్‌ అలర్ట్‌ జారీ

12 Jul, 2020 19:03 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్, సిక్కిం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. జూలై 12 నుంచి 16 మధ్య భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కోల్‌కతాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. హిమాలయాల పర్వత ప్రాంతాల మధ్య రుతుపవనాల పతనం, బెంగాల్ బే నుంచి బలమైన తేమ చొరబాటు కారణంగా వాతావరణ పరిస్థితిలో మార్పులు తలెత్తినట్లు పేర్కొంది.

భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, నీటి మట్టాలు పెరగవచ్చని బులెటిన్‌లో హెచ్చరించింది. ఈ నేప‌థ్యంలో బెంగాల్‌, సిక్కిం స‌హా వ‌ర్షాల ప్ర‌భావం ఉన్న ఈశాన్య‌ రాష్ట్రాల్లో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చ‌రిక‌లు చేసింది. చదవండి: 15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు 

మరిన్ని వార్తలు