'నరేంద్ర మోడీ గాలిపైనే ఆధారపడవద్దు'

26 Aug, 2014 18:56 IST|Sakshi
నరేంద్ర మోడీ

ముంబై: బీహార్ శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల నుంచి బిజెపి గుణపాఠం నేర్చుకోవాలని మిత్రపక్షం శివసేన హెచ్చరించింది. పనితీరు మెరుగుపరుచుకోవాలని సలహా కూడా ఇచ్చింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి-శివసేన కూటమి ‘మహాయుతి’  కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గాలిపైనే ఆధారపడటం మంచిది కాదని సామ్నా పత్రికలో సంపాదకీయం రాశారు.  

 ‘బీహార్‌లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమికి ఆరు సీట్లు రాగా, బీజేపీకి నాలుగే వచ్చిన వాస్తవాన్ని మనం అంగీకరించాలి. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడా ఉంటుందని ప్రజలు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కేవలం మాటలవల్లే గెలవలేం’ అని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు