జైల్లో జంతువు కంటే హీనంగా చూస్తున్నారు..

21 Jul, 2014 20:22 IST|Sakshi
జైల్లో జంతువు కంటే హీనంగా చూస్తున్నారు..
న్యూఢిల్లీ: భారత ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ చేసిన విజ్క్షప్తిపై సమాధానమివ్వాలని తీహార్ జైలు అధికారులను కోర్టు కోరింది. జైలులో ఓ జంతువు కంటే హీనంగా చూస్తున్నారని, రంజాన్ సమయంలో సరియైన ఆహారం ఇవ్వడం లేదని జైలు అధికారులుపై భత్కల్ కోర్టు న్యాయమూర్తి రాజ్ కపూర్ కు ఫిర్యాదు చేశారు. 
 
భత్కల్ ఫిర్యాదుపై జూలై 23 తేది లోపు వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది. భత్కల్ తరపు న్యాయవాది ఎంఎస్ ఖాన్ ఫిర్యాదును దాఖలు చేశారు. వివిధ నేరాల్లో నిందితుడైన భత్కల్ ను నేపాల్ సరిహద్దులో గత ఆగస్తులో అరెస్ట్ చేశారు. 
>
మరిన్ని వార్తలు