సోనియా వెంట ఉన్నది ‘ఆయన’ కాదు

2 Mar, 2020 19:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌తో కలిసి వచ్చిన సోనియా గాంధీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేస్తోన్న దృశ్యం అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జస్టిస్‌ మురళీధర్‌కు కాంగ్రెస్‌ పార్టీతో సంబంధాలు ఉన్నాయని, ఆయన కాంగ్రెస్‌ నాయకుడు మనీష్‌ తివారీకి సహాయకుడిగా కూడా పనిచేశారంటూ ‘రెండు ఫొటోల’ను కలిపిన ఫొటోను ‘మీడియా మాఫియా’ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. (రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ)

ఢిల్లీ అల్లర్లను రెచ్చగొట్టేలా విద్వేషపూరితంగా ప్రసంగించిన బీజేపీ నాయకులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదంటూ ఢిల్లీ పోలీసులను నిలదీసినందుకు ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ మురళీధర్‌ను పంజాబ్, హర్యానా కోర్టుకు కేంద్రం బదిలీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే జస్టిస్‌ మురళీధర్‌పై దుష్ప్రచారం కొనసాగుతోంది. సోనియా గాంధీ 2019, ఏప్రిల్‌ 11వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేసిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అప్పుడు ఆ ఫొటోలో సోనియా గాంధీ వెంట ఉన్నది ఆమె న్యాయవాది కేసి కౌశిక్‌. సోనియా గాంధీ వెంట జస్టిస్‌ మురళీధర్‌ వెళ్లే అవకాశమే లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. (ఢిల్లీ అల్లర్లపై నకిలీ ఫొటోలు వైరల్!)

మరిన్ని వార్తలు