ఆరే కాలనీలో మెట్రో షెడ్‌కు ఓకే: సుప్రీం

21 Oct, 2019 17:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే చెట్ల నరికివేతపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆరేకాలనీలో చెట్లను నరకడానికి వీల్లేదని సుప్రీం సోమవారం పునరుద్ఘాటించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, దీపక్‌ గుప్తాలతో కూడిన ప్రత్యేక బెంచ్‌ ఈ మేరకు సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని బెంచ్‌ లోతుగా పరిశీలించింది. పర్యావరణానికి నష్టం కలగకుండానే మెట్రో షెడ్‌ నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించింది. ఎన్ని చెట్లు పడగొట్టారు, ఎన్నింటిని తరలించారని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.

బృహణ్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు విన్పించారు. ఆరే కాలనీలో చెట్ల జోలికి వెళ్లబోమని, యథాతథ స్థితిని కొనసాగించాలని గత విచారణ సందర్భంగా  ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని సుప్రీంకోర్టుకు మెహతా విన్నవించారు. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడతామని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి కూడా హామీయిచ్చారు. ‘ఆరే కాలనీలో ఎటువంటి భవన నిర్మాణాలు ప్రాజెక్టులు లేవు. మెట్రో కార్‌ షెడ్‌ మాత్రమే నిర్మిస్తున్నార’ని ఆయన తెలిపారు. మెట్రో షెడ్‌ నిర్మాణానికి అనుకూలంగా ఆయన వాదనలు విన్పించారు. మెట్రో రైలు సర్వీసులు కారణంగా ఢిల్లీలో 7 లక్షల వాహనాలు రోడ్డు ఎక్కడం లేదని, దీంతో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్‌ 15కు వాయిదా వేసింది. (చదవండి: ఆందోళనకారులకు భారీ ఊరట)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కడ ఖాతా తెరవని బీజేపీ.. అందుకే బరిలో ఆమె

కొత్త ఫోన్‌.. ఓ ప్రాణాన్ని తీసింది

జైల్లో శివకుమార్‌తో కుమారస్వామి భేటీ

పాక్‌కు కశ్మీర్‌ గవర్నర్‌ హెచ్చరిక

ఒక్కరు కూడా ఓటు వేయలేదు!

‘భోలో తా రా రా... క్రేన్‌ తీసుకురావాలా!’

మోదీ ప్రాభవంతోనే వారిద్దరి గెలుపు!

భారీ వర్షం.. పోలింగ్‌కు అంతరాయం

‘గాంధీ జాతిపిత కాదు.. ఈ దేశం కన్న బిడ్డ’

బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనే..

నవంబర్‌ 18నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

ఒక్కొక్కరికి 20 డాలర్లు; పాక్‌ చర్య సిగ్గుచేటు

‘కాషాయ కూటమిదే విజయం’

తీహార్‌ జైలుకు కుమారస్వామి..

పోలింగ్‌ అప్‌డేట్స్‌ : బీజేపీ రికార్డులు బద్దలు కొట్టబోతోంది

జొమాటోకు రూ. లక్ష జరిమానా

ఆరంజ్‌ అలర్ట్‌

రైల్వే బోర్డులో సంస్కరణలు

నేడే ఎన్నికలు

‘కర్తార్‌పూర్‌’కు మన్మోహన్‌ రారు

‘ఎన్నికలొస్తే సర్జికల్‌ స్ట్రైకులొస్తాయ్‌’

మోదీ టర్కీ పర్యటన రద్దు

పాకిస్తాన్‌కు మరో చావుదెబ్బ

ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చెల్లిస్తాం..

యువ న్యాయవాదులకు ఆదర్శం పరాశరన్‌ - ఉపరాష్ట్రపతి

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే శాఖ కీలక నిర్ణయం!

భారత రాయబారికి పాక్‌ సమన్లు

నిర్మలా సీతారామన్‌పై అభిజిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?

రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌

వార్‌ వసూళ్లు: మరో భారీ రికార్డు

సినిమా చాలా బాగుంది: మహేష్‌ బాబు

విజయ్‌ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..