కొత్త క్రికెట్ 'లా' యాప్!

13 May, 2016 09:16 IST|Sakshi
కొత్త క్రికెట్ 'లా' యాప్!

న్యూ ఢిల్లీః క్రీడాభిమానులకు ఓ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. క్రికెట్ చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ఈ కొత్త అనువర్తనాన్ని ఓ క్రికెట్ క్లబ్ రూపొందించింది. ఢిల్లీలోని పురాతన క్రికెట్ సంస్థ క్రీడాభిమానుల హైటెక్ అవసరాలకు అనుగుణంగా కొత్త అప్లికేషన్ ను మార్కెట్ లో  విడుదల చేసింది.

అత్యంత పురాతన క్రికెట్ ఇనిస్టిట్యూట్ మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) క్రికెట్ క్రీడకు సంబంధించిన చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కొత్త యాప్ విడుదల చేసింది. ఈ నూతన ఆవిష్కారం యాండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 'ఎంసిసి లాస్ ఆఫ్ క్రికెట్'  పేరున అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త యాప్ లో... క్రికెట్ చట్టాలు క్రీడాభిమానులకు, వినియోగదారులకు  సులభంగా అర్థమయ్యేందుకు వీలుగా ఫొటోలు, క్విజ్, యానిమేషన్ రూపంలో ప్రత్యేక వివరణలతో  విడుదల చేసింది.

క్రికెట్ కు సంబంధించిన 42 చట్టాలను ఎంసీసీ యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. ఆట సెట్ ఆప్ దగ్గరనుంచీ ప్రతి విషయాన్ని అర్థమయ్యే రీతిలో వివరిస్తూ చట్టాలను ఎనిమిది విభాగాలుగా విభజించి యాప్ లో అందుబాటులోకి తెచ్చింది.

>
మరిన్ని వార్తలు