పూరి జగన్నాథుని గుడిలో ఆంక్షలు

17 Dec, 2017 03:02 IST|Sakshi

భువనేశ్వర్‌: పూరిలో కొలువై ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఒడిశా రాష్ట్ర సర్కారు కొన్ని ఆంక్షలు విధించింది. ఆలయ గర్భగుడిలోకి వీవీఐపీలు సహా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేసింది. ‘పరమానిక్‌ దర్శన్‌’, ‘సహన మేళా దర్శన్‌’ వేళలో భక్తులకు గర్భగుడి ప్రవేశం నిలిపివేయమని పేర్కొంది. ఆలయంలోని ‘బిటార్‌ కథ’వరకు మాత్రమే భక్తులను అనుమతించాలని తెలిపింది. సేవకులను తప్ప మరెవరినీ గర్భగుడిలోకి ప్రవేశించనీయవద్దని సూచించింది. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధించాలని పేర్కొంది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు