విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్‌ తప్పనిసరి

14 Feb, 2018 02:59 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదవాలనుకునే విద్యార్థులూ ఇకపై తప్పనిసరిగా నీట్‌ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష)లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్థులకు సరైన సామర్థ్యాలు లేకున్నా విదేశీ వర్సిటీలు వారికి వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారు భారత్‌లో వృత్తిని చేపట్టాలంటే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)లో కచ్చితంగా పాసవ్వాల్సిందే. కానీ దాదాపు 90 శాతం మంది విద్యార్థులు అందులో ఫెయిల్‌ అవుతున్నారు. దీంతో వారంతా దేశంలో నకిలీ వైద్యులుగా మారి పెనుముప్పుగా పరిణమిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేయాలంటే కూడా నీట్‌ను తప్పనిసరిచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు