రైలు గంట ఆలస్యమైతే సంక్షిప్త సందేశాలు

5 Nov, 2017 02:06 IST|Sakshi

తొలుత రాజధాని, శతాబ్ది రైళ్లల్లో..

న్యూఢిల్లీ: రైళ్లు ఆలస్యమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇకపై రాజధాని, శతాబ్ది వంటి రైళ్లు గంట లేదా అంతకన్నా ఎక్కువ ఆలస్యమైతే ఆ విషయాన్ని సదరు రైలులో వెళ్లే ప్రయాణికులకు సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్‌) ద్వారా తెలియజేస్తామని రైల్వేశాఖ వెల్లడించింది. శనివారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ సౌకర్యాన్ని దశలవారీగా మిగతా రైళ్లకు కూడా వర్తింపజేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌(సీఆర్‌ఐఎస్‌) దీన్ని రూపొందించిందన్నారు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు ప్రయాణికులు రిజర్వేషన్‌ దరఖాస్తులో మొబైల్‌ నంబర్‌ను నింపాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్‌ఎంఎస్‌ చార్జీలకయ్యే మొత్తాన్ని రైల్వేశాఖే భరిస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న 46 రాజధాని, 52 శతాబ్ది రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు