రైళ్లలో వ్యర్థాలకు ట్రాష్‌ బ్యాగులు!

28 Jul, 2018 03:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇక నుంచి విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ ప్రయాణికుల నుంచి వ్యర్థాలను ట్రాష్‌ బ్యాగుల్లో సేకరించేలా చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వనీ లోహాని అధికారులను ఆదేశించారు. డివిజన్‌ లెవల్‌ ఆఫీసర్లు, బోర్డు సభ్యులతో 17న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైళ్లలో పరిశుభ్రతను పెంచేందుకు ప్రయాణికుల భోజనాల అనంతరం ప్యాంట్రీ సిబ్బంది ఆ ప్లేట్లను బ్యాగుల్లో సేకరించాలని సూచించారు. సాధారణంగా భోజనం తిన్న తర్వాత ప్రయాణికులు ప్లేట్లను బెర్త్‌ల కింద పెడుతుంటారని, సిబ్బంది వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి తీసుకెళ్లడం వల్ల అందులోని వ్యర్థాలు కింద పడి బోగీలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ట్రాష్‌ బ్యాగును ప్రయాణికుడి వద్దకు తీసుకెళ్లే వ్యర్థాలనూ వారు అందులో వేస్తారని అన్నారు. 

మరిన్ని వార్తలు