అమిత్‌ షాతో అజిత్‌ దోవల్‌ భేటీ

19 Aug, 2019 18:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో క్షేత్రస్ధాయి పరిస్థితిని స్వయంగా సమీక్షించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గుబా సహా ఇతర అధికారులతో సోమవారం భేటీ అయ్యారు. కశ్మీర్‌లో పది రోజుల పాటు మకాం వేసి అక్కడి పరిస్థితులను చక్కబెట్టి దేశ రాజధానికి తిరిగివచ్చిన అనంతరం ధోవల్‌ అమిత్‌ షాతో భేటీ కావడం ఇదే తొలిసారి.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం అమిత్‌ షాతో చర్చకు వచ్చిన అంశాలపై మాట్లాడేందుకు దోవల్‌ నిరాకరించారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ము కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ రాష్ట్రంలో భద్రతను ముమ్మరం చేయడంతో పాటు నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించారు.

మరిన్ని వార్తలు