సీమ్యాట్‌లో ఒకే ఒక్కడు

8 Feb, 2019 02:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జీప్యాట్‌లోనూ అంతే

సీమ్యాట్, జీప్యాట్‌ ఫలితాలు ప్రకటించిన ఎన్‌టీఏ 

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆమోదం పొందిన మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌), జాతీయ స్థాయి ఫార్మసీ, ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జీప్యాట్‌) ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. గత నెల 28, 29 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించింది. సీమ్యాట్‌లో శర్మ నవాంశ్‌ సురేంద్ర అనే విద్యార్థి ఒక్కరే 100 పర్సంటైల్‌ సాధిం చి మొదటి ర్యాంకర్‌గా నిలిచినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. జ్యీపాట్‌లోనూ 302 మార్కులతో యావల్కర్‌ అంకిత నితిన్‌ ఒక్కరే 100 పర్సంటైల్‌ సాధించి మొద టి ర్యాంకర్‌గా నిలిచినట్లు వివరించింది. జీప్యాట్‌ స్కోర్‌కు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుందని వెల్లడించింది.

సీమ్యాట్‌కు హాజరయ్యేందుకు 64,582 మంది దరఖాస్తు చేసుకోగా 54,516 మంది హాజరైనట్లు వెల్లడించింది. బాలికలు 29,166 మంది బాలురు, 25,350 మంది బాలికలు హాజరైనట్లు వెల్లడించింది. జీప్యాట్‌ రాసేందుకు 42,827 మంది దరఖాస్తు చేసుకోగా, 40,649 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 18,044 మంది బాలురు, 22, 604 మంది బాలికలు ఉన్నట్లు వివరించింది. అందులో పీహెచ్‌డీ లో ప్రవేశానికి, స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేం దుకు 4,119 మంది అర్హత సాధించినట్లు తెలిపింది. అందులో 1,909 మంది బాలురు, 2,210 మంది బాలికలు ఉన్నారు. ఇందుకు అన్‌రిజర్వ్‌డ్‌లో 141 మార్కులు కటాఫ్‌ అని, దాంతో 1,952 మంది ఎంపి కయ్యారు. ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌లో కటా ఫ్‌ 117 మార్కులుగా 1,103 ఎంపిక అయ్యారు. ఎస్సీలలో 95 మార్కుల కటాఫ్‌తో 626 మంది, ఎస్టీలలో 74 కటాఫ్‌తో 313 మంది ఎంపికైనట్లు వివరించింది.   

మరిన్ని వార్తలు