ఫోటోతో పుకార్లకు చెక్‌ పెట్టిన యువ ఎంపీ

1 Jun, 2019 17:45 IST|Sakshi

కోల్‌కతా : తాజా లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన నటిమణి నుస్రత్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారు. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి.. అటు నుంచి రాజకీయాల్లోకి వచ్చారు నుస్రత్‌. ఇదిలా ఉండగా నుస్రత్‌ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ పుకార్లకు చెక్‌ పెట్టారు నుస్రత్‌. ఈ వార్తలు వాస్తవమే అంటూ.. ప్రేమికుడు తొడిగిన ఉంగరం కనిపించేలా ఉన్న ఫోటోను పోస్ట్‌ చేశారు. దానికి ‘జీవితంలో ఇద్దరికి ఇదే ఉత్తమమైంది అనిపించినప్పుడు కలల కన్నా వాస్తవం చాలా బాగుంటుంది’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు నుస్రత్‌.

మరోవైపు నుస్రత్‌ ప్రియుడు కూడా ఇదే ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ఒక వ్యక్తితో కలిసి జీవితాంతం పయణించాలనుకున్నప్పుడు మీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. వారితో కలిసి మిమ్మల్ని మీరు కొత్తగా కనుగొంటారు.. మీరు ఎప్పడు అనుకోని వ్యక్తితో కలిసి ఉంటారు.. థాంక్యూ నుస్రత్‌.. నా జీవితాన్ని విలువైనదిగా, అందమైనదిగా మార్చినందుకు.. నీకు ధన్యవాదాలు’ అనే మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. నుస్రత్‌ సోషల్‌ మీడియా వేదికగా తన ప్రేమ గురించి ప్రకటించడం ప్రస్తుతం హట్‌ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి : పార్లమెంటు వద్ద ఫొటోలు.. బుక్కైన ఎంపీలు..!)

When reality is finally better than ur dreams, the best thing to hold on to in life... is each other..!! @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

మోడలింగ్ రంగం నుంచి నటనవైపు వచ్చిన నుస్రత్ జహాన్ 2011లో శోత్రు అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఇప్పటి వరకు 19 చిత్రాల్లో నటించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా