మరోసారి వార్తల్లో నూస్రత్‌..ధాక్‌తో సందడి 

7 Oct, 2019 14:05 IST|Sakshi

ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ ఎంపీ నూస్రత్ జహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. కోల్​కతాకు చెందిన పారిశ్రామిక వేత్త, భర్త నిఖిల్ జైన్​తో కలిసి దుర్గా పూజలో సందడి చేశారు. ఎంపీ అయిన తరువాత తొలిసారి బెంగాల్‌లో జరుగుతున్న  దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట దుర్గాదేవికి  సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాదు దుర్గాష్టమి వేడుకల్లో సంగీత వాయిద్యమైన ధాక్ కూడా వాయించి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు.  దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిఖిల్‌ జైన్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు.  ప్రస్తుతం ఇవి  సోషల్‌మీడియాలో  విపరీతంగా షేర్‌ అవుతున్నాయి

ప్రజలు సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని తాను  అమ్మవారిని ప్రార్థించారని  నూస్రత్‌ తెలిపారు.  మనమంతా బెంగాల్‌  కుటుంబంలో భాగమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన వెంటనే కోల్​కతాకు చెందిన పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్​ను పెళ్లాడి,  కొత్త పెళ్లి కూతురుగా లోక్​సభలో  ప్రమాణ స్వీకారం చేసి వార్తల్లోనిలిచిన సంగతి తెలిసిందే. 


ఎంపీ నూస్రత్ జహన్, నిఖిల్‌ జైన్‌ దంపతులు

Playing dhaak for the first time with my wonderful wifastic @nusratchirps @suruchisangha #aroopbiswas

A post shared by Nikhil Jain (@nikhiljain09) on

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు