సరి-బేసి విధానంతో రె'ఢీ'

9 Nov, 2017 15:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయాయి. గత మూడు రోజులుగా నగరంలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి తోడు వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు గాలిలో కలవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వాయుకాలుష్యం చేరుకుంది. దీంతో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. నవంబర్‌ 13 నుంచి నవంబర్‌ 17 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అధికారిక ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఈ విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకోవడంతో, ఢిల్లీ హైకోర్టు ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఒకవేళ అవసరమైతే నేడు, రేపు కూడా ఈ సరి-బేసి విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. సరి-బేసి విధానంతో ఢిల్లీలో వాహన ట్రాఫిక్‌ సగం మేర తగ్గుతోంది. డిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యాలు తక్కువగా ఉండటం ఈ విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. కానీ కాలుష్య స్థాయిలు తగ్గించే లక్ష్యంతో కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కమర్షియల్‌ ట్రక్కులకు నగరంలోకి అనుమతి లేదని పేర్కొంది. నిర్మాణ కార్యకలాపాలు ఆపివేయాలని తెలిపింది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్‌ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

రిపీట్‌ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్‌!

గరీబ్‌రథ్‌ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

రాజకీయాల్లోకి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

ఎన్‌కౌంటర్ల దర్యాపుపై సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..

32 ట్రాక్టర్లు.. 200 మంది

మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్‌

‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

పాన్పుపై సేదతీరిన పులి!

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’