మిడ‌త‌ల నివార‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు

2 Jun, 2020 14:57 IST|Sakshi

భువ‌నేశ్వ‌ర్ : రాష్ర్టంలో మిడ‌త‌ల దండును నియంత్రించే దిశ‌గా ఒడిశా ప్ర‌భుత్వం  మంగ‌ళ‌వారం అన్ని జిల్లాల‌కు ప్ర‌త్యేకంగా నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించింది. జూన్ 15న రాష్ర్టంలో మిడ‌త‌ల స‌మూహం దాడిచేసే అవ‌కాశం ఉన్నందున అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇప్ప‌టికే 8 ల‌క్ష‌లు రైతుల‌కు కేంద్రం ప‌లు సూచ‌న‌లు జారీ చేసింది. అంతేకాకుండా జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాలని పేర్కొంది. ఇక జూన్ 30 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన నేప‌థ్యంలో భారీ స‌డ‌లింపుల‌కు అనుమ‌తులు ఇచ్చింది. క‌ర్ప్యూ స‌మ‌యాన్ని కూడా త‌గ్గించాల‌ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినప్ప‌టికీ ఒడిశా ప్ర‌భుత్వం మాత్రం రాత్రి వేళల్లో ఎలాంటి మార్పుల‌కు అంగీక‌రించ‌లేదు.
(వలస కార్మికులకు ఓపిక లేకనే....అమిత్‌ షా)

ఇదివ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌లు మాధిరిగానే రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు క‌ర్ప్యూ ఉంటుంద‌ని పేర్కొంది.  మాస్కులు ధ‌రించ‌డం, బ‌హిరంగంగా ఉమ్మివేయ‌డం లాంటి నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారికి జ‌రిమానా విధిస్తామ‌ని తెలిపింది. మొద‌టిసారి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే 500 రూపాయ‌లు, రెండ‌వ‌సారి ఉల్లంఘిస్తే 1000 రూపాయల జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అంతేకాకుండా ప్ర‌భుత్వం విడుదల చేసిన తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. గంజాం, పూరి, నాయగర్, ఖుర్దా, కటక్, జగత్సింగ్‌పూర్, కేంద్రపారా, జాజ్‌పూర్, భద్రాక్, బాలసోర్,  బోలంగి స‌హా  11 జిల్లాల్లో శని, ఆదివారాల్లో మొత్తం ష‌ట్‌డౌన్ ఉండ‌నుంది. అయితే షాపింగ్ మాల్స్, సినిమా థియేట‌ర్స్‌, స్విమ్మింగ్ పూల్స్ స‌హా ప్రార్థ‌నా మందిరాల్లోకి కూడా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. కేంద్రం ఇప్ప‌టికే ప్రార్థనా స్థ‌లాల‌కు అనుమ‌తించిన‌ప్ప‌టికీ ఒడిశా ప్ర‌భుత్వం మాత్రం నిబంధ‌న‌లు స‌డ‌లించ‌లేదు. అంతేకాకుండా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గ‌ర్భిణీలు, 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారికి బ‌హిరంగ కార్య‌క్ర‌మాల్లో అనుమ‌తి లేద‌ని తెలిపింది. (కరోనా : కొత్త యాప్‌ ప్రారంభించిన ఢిల్లీ సీఎం )

మరిన్ని వార్తలు