ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

11 Oct, 2019 15:06 IST|Sakshi

పూరి : ఒడిశాలో కొందరు భక్తులు ఆచరిస్తున్న మూఢ నమ్మకం చూసిన వారికి ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఎవరైనా అర్చకులు, వేద పండితులు తమ చేతులతో భక్తులను ఆశీర్వదిస్తారు. కానీ ఒడిశాలోని ఖోర్దా జిల్లా భాన్‌పూర్‌ ప్రాంతంలో మాత్రం పూజరి తన కాళ్లతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఆ అర్చకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు వరుసలో కూర్చోని ఉంటే.. ఆ అర్చకుడు ప్రతి ఒక్కరి తలపై తన కాలును ఉంచి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత వెన్నుపై కూడా కాలుతో తొక్కుతాడు. ఆ భక్తుల్లో కొందరు చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం.

ఇటీవల జరిగిన విజయదశమి వేడుకల సందర్భంగా వాహన పూజ చేయించుకున్న పలువురు భక్తులు అర్చకుని కాలును తమ నెత్తిపై పెట్టించుకుని ఆశీస్సులు పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి మూఢ నమ్మకాలు వల్ల ప్రపంచంలో భారత్‌కు చెడ్డపేరు వస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆచారాలను పాటిస్తున్న ప్రజలు వాటి నుంచి బయటకు రావాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు