లాభాపేక్ష పదవుల జాబితాతో బిల్లు

8 Aug, 2016 09:48 IST|Sakshi

న్యాయ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన

న్యూఢిల్లీ: లాభాపేక్ష పదవుల్లో కొనసాగడం వల్ల ఎంపీలు అనర్హత ముప్పును ఎదుర్కోవడం తెలిసిందే. అయితే ఏ ఏ పదవుల్లో ఉంటే అనర్హతకు గురవుతారోనన్న వివరాలతో బిల్లు రూపొందించాలని న్యాయ శాఖను పార్లమెంట్ ఉమ్మడి కమిటీ కోరింది. ఏ పదవుల్లో కొనసాగితే సభ్యతం కోల్పోతారన్నది రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు, పార్లమెంటు చట్టం(అనర్హత నిరోధం), హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా పేర్కొనలేదని తన తాజా నివేదికల్లో పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.

ఏఏ విభాగాలు, ఆఫీసులు అనర్హత కిందకు వస్తాయో, ఏవి రావో పేర్కొంటూ నమూనా బిల్లును రూపొందించాలని కమిటీ సూచించింది. పార్లమెంట్ షెడ్యూల్‌లో అనర్హత వర్తించే విభాగాల జాబితా ఉన్నా... చాలా విభాగాలు అందులో లేవని కమిటీ అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు