వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ టికెట్‌ ధరలివే..

11 Feb, 2019 17:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఢిల్లీ-వారణాసిల మధ్య పరుగులు పెట్టే ట్రైన్‌ 18 టికెట్‌ ధరలను ఖరారు చేశారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ 1850కాగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చార్జ్‌ రూ 3,520గా నిర్ధారించారు. ఇవి క్యాటరింగ్‌ సేవలతో కూడిన టికెట్‌ ధరలని అధికారులు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో చైర్‌ కార్‌ ధర రూ 1795 కాగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ 3470గా ఖరారు చేశారు.

కాగా, ఇదే దూరంలో తిరిగే శతాబ్ధి రైళ్లతో పోలిస్తే చైర్‌ కార్‌ ధరలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు 1.4 రెట్లు అధికమని అధికారులు వెల్లడించారు. ఈ సెమీ హైస్పీడ్‌ ట్రైన్‌ను ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఢిల్లీ నుంచి వారణాసికి ఈ రైలులో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో ప్రయాణించే వారికి టీ, బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనాన్ని రూ 399కే అందించనుండగా, చైర్‌ కార్‌లో ప్రయాణీకులు ఈ సేవలకు రూ 344 చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ రైలు మొత్తం 755 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 8 గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తుంది. ఈ రైలుకు కాన్పూర్, ప్రయాగరాజ్‌ స్టేషన్లలో స్టాపులుంటాయి.

మరిన్ని వార్తలు