పుల్వామా దాడి వెనుక ‘మహ్మద్‌ భాయ్‌’

10 Mar, 2019 19:13 IST|Sakshi

శ్రీనగర్‌ : పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదసర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పుల్వామా జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్‌ అహ్మద్‌ఖాన్‌ పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు.

కాగా, జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్‌ సమకూర్చినట్టు అధికారులు గుర్తించారు. ట్రాల్‌ ప్రాంతంలోని మిర్‌ మొహల్లా నివాసైన ఖాన్‌ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్‌ అహ్మద్‌ దార్‌ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ కోర్సు చేశాడు. కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్‌ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు