ఆ పాపకు కరోనా టెస్ట్‌ నెగెటివ్‌..

22 Mar, 2020 10:23 IST|Sakshi

గౌహతి : అసోంలో అనుమానిత కోవిడ్‌-19 కేసుగా నమోదైన నాలుగేళ్ల చిన్నారికి రెండో సారి నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్‌గా తేలడంలో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తల్లి, సోదరితో కలిసి గురువారం రైలులో గురువారం అసోంకు వచ్చిన పాపకు జోర్హాత్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే దిబ్రూగర్‌ జిల్లాలోని లహోవల్‌లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)కు చెందిన ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రానికి పాప శాంపిల్స్‌ పంపగా అక్కడ నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

పాపకు ఐసీఎంఆర్‌ ప్రాంతీయ కేంద్రంలో నిర్వహించిన పరీక్షలో కోవిడ్‌-19 నెగెటివ్‌గా వచ్చిందని జోహ్రాత్‌ డిప్యూటీ కమిషనర్‌ రోష్నీ అపరంజి కొరాటి తెలిపారు. నాలుగేళ్ల చిన్నారి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 315కు చేరినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో ఇంతవరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు.

చదవండి : తినడం కంటే కొనడం ఎక్కువైంది

మరిన్ని వార్తలు