కోర్టు బయట సెటిల్‌మెంట్లకు ఓకే

8 Jun, 2016 01:30 IST|Sakshi

ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు

 న్యూఢిల్లీ: కోర్టు బయట సెటిల్‌మెంట్లకు చట్టబద్దత కల్పించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు తెలిపింది. న్యాయ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ‘న్యాయ సేవ, సంస్కరణల జాతీయ సలహా మండలి’  ముందు న్యాయ శాఖ ఈ ప్రతిపాదన ఉంచింది. కొన్ని రకాల కేసులను కోర్టు బయట పరిష్కరించడం ద్వారా న్యాయస్థానాలకు కొంత భారం తగ్గుతుందని శాఖ భావిస్తోంది.ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వానికి శాసన సహకారంతో చట్టబద్దత కల్పించాలనే ఆలోచనను తెరపైకి తెచ్చింది.

మధ్యవర్తిత్వానికి చట్టబద్దత లేనందున చాలామంది కేసుల పరిష్కారానికి ఆసక్తి చూపట్లేదని భావిస్తోంది. న్యాయ మంత్రి అధ్యక్షతన ఉన్న ఈ కౌన్సిల్లో సుప్రీంకోర్టు, బార్‌కౌన్సిల్, హోం, న్యాయ శాఖ సహాయ మంత్రులు, అటార్నీ జనరల్ సభ్యులుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు