కిక్కిరిసిన 'ఢిల్లీ మెట్రో'పై పేరడీల జోరు!

5 Jan, 2016 11:26 IST|Sakshi
కిక్కిరిసిన 'ఢిల్లీ మెట్రో'పై పేరడీల జోరు!

న్యూఢిల్లీ: 2016లో అది మొదటి సోమవారం. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' అంకెల విధానానికి విషమ పరీక్ష ఎదురైంది కూడా సోమవారం నాడే. మూడు రోజుల వారాంతపు సెలవుల అనంతరం ఢిల్లీ వాహనదారులు సోమవారమే రోడెక్కారు. 'సరి-బేసి' విధానం కారణంగా చాలామంది తమ కార్లను ఇంట్లోనే వదిలేసి.. ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. దీంతో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిపోయాయి.

సాధారణంగానే రద్దీగా ఉండే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ మరింత కిటకిటలాడింది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతోపాటు విపరీతమైన జనంతో కిక్కిరిసిపోయిన మెట్రో స్టేషన్ ఫొటో ఒకటి ట్విట్టర్, ఫేస్బుక్ లో దుమ్మురేపింది. కాసేపటిలోనే విపరీతంగా షేర్ అయి వైరల్ గా మారింది. అయితే ఆ ఫొటో పాతదని, గత ఏడాది అక్టోబర్ 22న తీసిన ఈ ఫొటోకు 'సరి-బేసి' విధానానికి ఎలాంటి సంబంధం లేదని హిందూస్థాన్ టైమ్స్ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించడంతో.. ఈ ఫేక్ వైరల్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. పాత ఫొటోను వైరల్ చేయడాన్ని తప్పుబడుతూ పేరడీ ఫొటోలతో హోరెత్తించారు. ఢిల్లీలోని రాజీవ్ చౌక్ లో రద్దీ ఎక్కువగా ఉందన్న వార్తలను ఎద్దేవా చేస్తూ పలు ఫొటోలు షేర్ చేశారు.

రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో రైలు కోసం వేచివేచి ఇలా గడ్డాలు, మీసాలు పెరిగిపోయాయి

మరిన్ని వార్తలు