ఆ వెబ్సైటుకు అవార్డు ఇవ్వాలి: సీఎం

9 Oct, 2014 09:52 IST|Sakshi
ఆ వెబ్సైటుకు అవార్డు ఇవ్వాలి: సీఎం

అద్భుతమైన ఫిక్షన్ వార్త రాసినందుకు ఓ వెబ్సైటుకు అవార్డు ఇవ్వాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. విశాల్ భరద్వాజ్ తీసిన 'హైదర్' సినిమాపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఫిర్యాదు చేశానంటూ వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. అసలు తాను ఇంతవరకు ఆ సినిమాయే చూడలేదన్నారు. ఆ సినిమాలో కాశ్మీర్ను చెడ్డగా చూపించారంటూ తాను విశాల్ భరద్వాజ్కు ఫిర్యాదు చేసినట్లు ఓ వెబ్సైట్లో వచ్చిన కథనాలన్నీ గాలివార్తలేనని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఇంత అద్భుతమైన ఫిక్షన్ చేసినందుకు ఆ వెబ్సైట్కు అవార్డు ఇవ్వాలి' అని ఆయన ట్వీట్ చేశారు. వెంటనే ఆ కథనానికి సవరణ వేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

అసలు తాను సినిమా చూసినట్లు, ఫిర్యాదు చేసినట్లు వాళ్లు ఎక్కడ విన్నారో తనకు తెలియదని, వాళ్ల నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నానని కూడా అన్నారు. అలనాటి హేమ్లెట్ నాటకం స్ఫూర్తితో విశాల్ భరద్వాజ్ తన 'హైదర్' చిత్రం ద్వారా కాశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలను చూపించారు. దీనికి కాశ్మీరీ రచయిత బషరత్ పీర్ కథా సహకారం అందించారు. (ఇంగ్లీషు కథనం)

 

>
మరిన్ని వార్తలు