స్కూల్లో మ్యాథ్స్‌ చెప్పి పరువు తీసుకున్న మంత్రి

16 Sep, 2017 11:32 IST|Sakshi
స్కూల్లో మ్యాథ్స్‌ చెప్పి పరువు తీసుకున్న మంత్రి

డెహ్రాడూన్‌ : మంత్రి వచ్చారన్న సంతోషం ఆ పాఠశాలలో ఎంతో సేపు నిలవలేదు. వచ్చి రాగానే ఆయన ఓ టీచర్‌కు పరీక్ష పెట్టి తీవ్రంగా అవమానించారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ విద్యాశాఖమంత్రి అరవింద్‌ పాండే అనూహ్యంగా ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వచ్చిరాగానే ఆ స్కూల్‌లోని గణితం బోధిస్తున్న టీచర్‌కు పరీక్ష పెట్టారు.

తొలుత మైనస్‌ ప్లస్‌ మైనస్‌ కలిపితే మైనస్‌ వస్తుందా ప్లస్‌ వస్తుందా అని ప్రశ్నించగా టీచర్‌ మైనస్‌ అని చెప్పగా దానికి అడ్డు చెప్పి ప్లస్‌ అని చెప్పిన మంత్రి ఆ తర్వాత మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత ప్రశ్నించారు. దాని సమాధానం మైనస్‌ రెండుకాగా, అందరి సమక్షంలో మంత్రి సున్నా అని సమాధానం చెప్పడమే కాకుండా తాను చెప్పినదే సరైందంటూ వాధించారు. ఆ టీచర్‌ను ఓ వారంపాటు స్కూల్‌ నుంచి బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాగా, తాను టీచర్‌ను అందుకు పంపించలేదని, ఆమె ప్రభుత్వ ప్రచురణ పుస్తకం కాకుండా గైడ్‌ చూసి పాఠశాలు చెబుతున్నారంటూ తప్పించుకునే యత్నం చేశారు.