చంద్రయాన్‌–2: మూడో ఘట్టం విజయవంతం

5 Sep, 2019 05:14 IST|Sakshi

జాబిలమ్మకు మరింత చేరువగా విక్రమ్‌ ల్యాండర్‌..

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌–2 ప్రయోగంలో మూడో ఘట్టాన్ని కూడా శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. చంద్రయాన్‌–2 మిషన్‌లోని విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిలమ్మకు మరింత దగ్గరగా చేర్చేందుకు బుధవారం తెల్లవారుజాము 3.42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. దీనికోసం ల్యాండర్‌లో నింపిన ఇంధనాన్ని తొమ్మిది సెకన్లపాటు మండించారు. బెంగళూరు సమీపంలోని బైలాలు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్‌ చంద్రుడికి దగ్గరగా 35 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 101 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తోంది.

ఈ నెల ఏడోతేదీ అర్ధరాత్రి 1.30 గంటల నుంచి రెండున్నర గంటల్లోపు ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై మృదువుగా దించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ల్యాండర్‌ తలుపులు తెరుచుకుని రోవర్‌(ప్రగ్యాన్‌) చంద్రుడి మీదకు దిగి 14 రోజులపాటు తిరిగి వివిధ పరిశోధనలు చేసి సమాచారాన్ని సేకరించి భూ నియంత్రిత కేంద్రానికి పంపిస్తుంది. మరోవైపు.. ల్యాండర్‌ను వదిలిపెట్టిన ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 96 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 125 కిలోమీటర్లు ఎత్తులో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ల్యాండర్‌ కదలికలను తెలియజేసే పనిలో నిమగ్నమై ఉంది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌కు తోడుగా ఉంటాం: అమెరికా

ముంబైలో స్కూళ్లు, కాలేజీలు మూత!

మళ్లీ టీచర్‌గానే పుట్టాలి

రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

ఆ మందులు ఆయువు పెంచుతాయా?

అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ టాప్‌

శివకుమార్‌కు 13 వరకు కస్టడీ

ఆ నలుగురు

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

ఈనాటి ముఖ్యాంశాలు

డీకే శివకుమార్‌కు 10రోజుల కస్టడీ

ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

కశ్మీర్‌ అంశం, చిదంబరం అరెస్ట్‌ రహ​స్యమిదే!

దంచికొడుతున్న వానలు.. ముంబైలో రెడ్‌ అలర్ట్‌

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 19 మంది మృతి

హరియాణా కాంగ్రెస్‌కు కొత్త సారథి..

మోదీ పిలుపునకు ‘అమెజాన్‌’ పలుకు

కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు

లండన్‌ ఘటన; బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ

బుల్లెట్‌ గాయంతో కశ్మీర్‌లో బాలుడు మృతి..!!

అమిత్‌ షాకు సర్జరీ

ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

కార్మికుల జీవితాలు ఎవడికి కావాలి?!

8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం

భారీ వర్షాలతో మునిగిన ముంబై

ఎదుటే గణేష్‌ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....