రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం

15 Jun, 2017 01:33 IST|Sakshi
రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం

మంద్‌సౌర్‌: మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లాలో ఇటీవల రైతులపై పోలీసులు జరిపి న కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబా లను ఆ రాష్ట్ర సీఎం చౌహన్‌ బుధవారం పరామర్శించారు. కాల్పుల ఘటనలో మర ణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ. కోటి చొప్పున నష్ట పరిహారాన్ని సీఎం చౌహన్‌ చేతుల మీదుగా అందజేశారు.

పంట ఉత్ప త్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతుల రుణాన్ని మాఫీ చేయాలని కోరుతూ ఈనెల 6న మంద్‌ సౌర్‌ జిల్లాలోని రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మార డంతో వారిపై పోలీసులు కాల్పులు జరి పారు. ఈ కాల్పుల్లో మరణించిన రైతుల సంఖ్య ఆరుకు చేరింది.  బుధవారం ఉద యం సీఎం చౌహన్‌ ఆయన భార్య సాధనతో కలసి  ప్రత్యేక విమానంలో మంద్‌సౌర్‌ చేరుకున్నారు. అక్కడ్నుంచి నేరుగా కాల్పుల ఘటనలో మరణించిన కుటుంబాలను పరామర్శించి నష్టపరిహారాన్ని అందజేశారు.    రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్‌లో తాజాగా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

మరిన్ని వార్తలు