రామ మందిర నిర్మాణానికి రూ.1కోటి విరాళం: ఉద్ధవ్‌

7 Mar, 2020 14:53 IST|Sakshi

సాక్షి, లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రూ.కోటి విరాళం ప్రకటించారు. మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే శనివారం అయోధ్యను సందర్శించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి అయోధ్య పర్యటించి, మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఉద్ధవ్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తాను ప్రకటించిన కోటి రూపాయుల విరాళం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదని, తమ సొంత ట్రస్ట్‌ నుంచి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

అలాగే మందిర నిర్మాణంలో తాము కూడా పాలుపంచుకుంటామని తెలిపారు. తామే అసలైన హిందువాదులమని, బీజేపీ హిందుత్వాన్ని ఎప్పుడో విడిచిపెట్టిందని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. తాము బీజేపీకి దూరమయ్యామే కానీ.. హిందుత్వానికి కాదని ఆయన స్పష్టం చేశారు. త్వరలో అయోధ్యలో అద్భుతమైన ఆలయం నిర్మితం అవుతుందని అన్నారు. మందిర నిర్మాణంలో పాల్గొనే రామభక్తులకు బస కల్పించాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యను కోరారు. . (వీహెచ్పీ మోడల్లోనే మందిర్..)

మరోవైపు గురువారం ముంబై నుంచి ప్రత్యేక రైలులో వేలాదిమంది శివ సైనికులు అయోధ్య చేరుకున్నారు. కాగా 2019 నవంబర్‌ 29న రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ పార్టీల బలంతో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఉద్థవ్‌ ఠాక్రే శివాజీ పార్క్‌ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆఘాడి ప్రభుత్వం వంద రోజులు పూర్తి కా4గాదనే మార్చిలో అయోధ్యను పర్యటించి శ్రీ రాముడిని దర్శించుకుంటానని ప్రకటించారు. ఆ మేరకు ఆయన ఇవాళ అయోధ్యలో పర్యటించారు. (2022 నాటికి మందిర్ సిద్ధం..)

>
మరిన్ని వార్తలు