పాక్ కాల్పులు: భార‌త జ‌వాను మృతి

14 Jun, 2020 10:06 IST|Sakshi

క‌శ్మీర్‌: భారత్-పాక్ సరిహద్దు వెంబడి దాయాది దేశం పాకిస్తాన్‌ మ‌రోసారి బ‌రితెగించింది. ఆదివారం జ‌మ్ము క‌శ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో షాపూర్‌, కిర్ణి సెక్టార్ల ప‌రిధిలో నియంత్ర‌ణ రేఖ(ఎల్ఓసి) వెంబడి కాల్పులు జ‌రుపుతూ, మోర్టార్లు విసిరింది. ఈ దాడిలో ఒక భార‌త సైనికుడు ప్రాణాలు కోల్పోగా మ‌రో ఇద్ద‌రు గాయాల‌పాల‌య్యారు. కాగా స‌రిహ‌ద్దుల వెంబ‌డి పాక్ ప‌దే ప‌దే కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతోందని భార‌త‌ ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ దేవేంద‌ర్ ఆనంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. (సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలు..)

ఈ ఏడాది జూన్ మొద‌టి ప‌ది రోజుల్లోనే 114 సార్లు కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డింద‌ని వెల్ల‌డించారు. గ‌డిచిన ఆరునెల‌ల్లో 2 వేల సార్ల‌కు పైగా కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింద‌ని మండిప‌డ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. గత ఆరు రోజులుగా పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. (ఎల్‌వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా