జైలులో ఖైదీలకు పాము కాట్లు 

14 Aug, 2019 18:11 IST|Sakshi

లక్నో : జిల్లా జైలులో ముగ్గురు ఖైదీలు పాము కాటుకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వీరిలో ఒకరు మృత్యువాతపడగా మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌  రాష్ట్రమంతటా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లక్నో జిల్లా జైలు మొత్తం నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో వరద నీటికి కొట్టుకువచ్చిన పాములు అక్కడి ఖైదీలు బబ్బు, దిలీప్‌, రాజ్‌ కుమార్‌లను కాటు వేశాయి. దీంతో జీవితఖైదు అనుభవిస్తున్న బబ్బు మరణించగా  మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీనిపై జైలర్‌ సతీష్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘‘జైలు ఆవరణంలో సంచరిస్తున్న పాములను పట్టుకోవటానికి పాములను పట్టేవారిని పిలిపించాము. వారు నాలుగు పాములను పట్టుకున్నార’’ని వెల్లడించారు. 
 

మరిన్ని వార్తలు