కొత్తజంటకు ఉల్లిగడ్డలే బహుమానం

8 Dec, 2019 09:40 IST|Sakshi

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. కేజీ రూ.200 పలుకుతుండడంతోతో సామాన్యలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి రెండు ఉల్లికాడలే మహాప్రసాదమని వంటల్లో వేసుకుని అలా కానిచ్చేస్తున్నారు. ఇదే సమయంలో ఉల్లి ఘాటుపై హాస్య సన్నివేశాలూ నమోదవుతున్నాయి. బాగల్‌కోటెలో జరిగిన ఒక పెళ్లిలో స్నేహితులు వధూవరులకు  ఉల్లిగడ్డల కానుకను బహూకరించారు. చిన్న గంపలో ఉల్లి వేసి అందజేయడంతో కొత్త జంటతో పాటు అతిథులు నవ్వుల్లో మునిగితేలారు.

నిర్మలా సీతారామన్‌కు ఉల్లిగడ్డల పార్శిల్‌ 
తాను ఉల్లిగడ్డలు తినలేదు కాబట్టి వాటి ధర తెలియదంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి పెరంబలూర్‌ కాంగ్రెస్‌ నేతలు ఉల్లిగడ్డలను పార్శిల్‌ చేశారు. ప్రçస్తుతం ఉల్లి ధర రూ.200కు చేరింది. జనవరి వరకూ ధర తగ్గద ని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ సాగింది. ఉల్లి ధరలు నియంత్రించడంతో ప్రభుత్వ తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ తమ ఇంట్లో ఉల్లిగడ్డ, వెల్లుల్లి తినరని, ఉల్లి ధర గురించి తెలియ దని వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగింది. శుక్రవారం పెరంబలూర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో దేశంలో ఉల్లిగడ్డ ధరని తగ్గించడంలో విఫలైన ప్రధానమంత్రికి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి నిర్మాలాసీతారామన్‌కు ఉల్లిగడ్డలను పార్సల్‌ చేశారు. అందులో పంపిన లేఖలో.. ఇప్పటి వరకు ఉల్లిగడ్డలు తినని వారు మొదట తినాలన్నారు. ఉల్లిగడ్డ ధరలు నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు