పోలీసు కోసం జనం పోరాటం!

14 May, 2020 15:42 IST|Sakshi

ముంబై: సాధారణంగా పోలీసులకు, ప్రజలకు మధ్య అంత సత్సబంధాలు ఉండవు. సినిమాలో మాత్రమే నిజాయితీ గల పోలీసు ఆఫీసర్‌కు ఏదైన జరిగితే జనం పోరాడటం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే... నిజాయితీగా పనిచేస్తున్న పాల్‌ఘర్‌ జిల్లా ఎ‍స్పీని మహారాష్ట్ర హోం మినిస్టర్‌ అనిల్‌ దేశ్‌ ముఖ్‌ సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆయనను వెనక్కి తీసుకురావాలంటూ పాల్‌ఘర్‌ గ్రామస్థులు ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్‌ నిర్వహిస్తూ సంతకాలు స్వీకరిస్తోన్నారు. పాల్‌ఘర్‌ మూక దాడులకు సంబంధించి ఎస్పీ గౌరవ్‌ సింగ్‌ని 5 రోజుల క్రితం అత్యవసర సెలవు తీసుకొని వెళ్లా‍ల్సిందిగా మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే గౌరవ్‌ వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇసుక మాఫీయా, గుట్కా, లిక్కర్‌ మాఫియాని అన్నింటిని అరికట్టారని పాల్‌ఘర్‌ ప్రజలు తెలిపారు. ఆయన వచ్చినప్పటి నుంచే ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పారు. గౌరవ్‌ వారందరి ఆస్తి అని, ఆయన సూపర్‌ కాప్‌ అని పేర్కొన్నారు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఛాన్స్!)

అయితే పాల్‌ఘర్‌లో మూకదాడి జరిగిన వెంటనే ప్రభుత్వం అయనను వెంటనే మే 8 తేదీన సెలవు మీద పంపించేసింది. ఆయనను మళ్లీ వెనక్కి రప్పించడానికి సుజిత్‌సింగ్‌, సామాజిక కార్యకర్త కరణ్‌ చౌదరి ఆధ్వర్యలో ఒక ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ను నడిపిస్తూ సంతకాలు కూడా స్వీకరిస్తోన్నారు. ఇప్పటి వరకు 350 మంది దీని మీద సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాఖ్రేకి గౌరవ్‌సింగ్‌ని వెనక్కి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేస్తోన్నారు.  పాల్‌ఘర్‌ మూకదాడులలో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కేసుకు సంబంధించి రాష్ట్ర క్రిమినల్‌ ఇన్వేస్టిమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ 12 మందిని అరెస్ట్‌ చేసింది. వారిలో ఒక మైనర్‌ కూడా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య 146 కి చేరింది. (సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు